సమ్మతి పత్రాలు అందజేసిన 487 మంది సిబ్బంది

Wed,November 6, 2019 12:11 PM

హైదరాబాద్‌ : ఆర్టీసీ కార్మికులు నవంబర్‌ 5వ తేదీ అర్ధరాత్రి లోపు విధుల్లో చేరాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ గడువు విధించిన విషయం విదితమే. సీఎం కేసీఆర్‌ విధించిన గడువు నిన్న రాత్రితో ముగిసింది. అయితే గడువు లోపు విధుల్లో చేరేందుకు రాష్ట్రవ్యాప్తంగా 487 మంది సిబ్బంది సమ్మతి పత్రాలు అందజేశారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ పరిధిలో 111, హైదరాబాద్‌ జోన్‌లో 73, హైదరాబాద్‌ బస్‌ భవన్‌లో 216, కరీంనగర్‌ జోన్‌ పరిధిలో 87 మంది సమ్మతి పత్రాలను సంబంధిత అధికారులకు అందజేశారు. అయితే ఆర్టీసీ కార్మికుల సమ్మెపై కోర్టుకు సమర్పించాల్సిన వివరాలపై మంత్రి పువ్వాడ అజయ్‌, రవాణా శాఖ అధికారులతో సీఎం కేసీఆర్‌ చర్చిస్తున్నట్లు సమాచారం.

23
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles