బాగా అలసిపోతున్నారా..? వీటిని తీసుకోండి..!

Thu,December 20, 2018 03:25 PM

6 foods you should take if you get tired everyday

నిద్రలేమి, పనిభారం, ఆందోళన, ఒత్తిడి.. వంటి అనేక కారణాల వల్ల చాలా మంది ఆఫీసుల్లో లేదా నిత్యం పనిచేసే చోట యాక్టివ్‌గా ఉండలేకపోతుంటారు. కొంచెం పనిచేసినా అలసట చెందినట్లు భావిస్తారు. దీనికి తోడు నిద్ర కూడా వచ్చినట్లు ఉంటుంది. అలాంటి వారు ఎప్పుడూ ఉత్సాహంగా ఉండరు. అయితే ఈ సమస్య నుంచి బయట పడాలంటే అందుకు కింద సూచించిన ఆహారాలను నిత్యం తీసుకోవాలి. వీటితో శరీరానికి శక్తి అందడమే కాక, యాక్టివ్‌గా కూడా ఉండవచ్చు. మరి ఆ ఆహారాలు ఏమిటంటే...

1. హోల్ గ్రెయిన్ బ్రెడ్

తృణ ధాన్యాలతో తయారు చేసిన బ్రెడ్‌లో విటమిన్ ఇ, బి, ఫైబర్ ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని ఇస్తాయి. దీని వల్ల రోజంతా యాక్టివ్‌గా ఉండి ఉత్సాహంగా పనిచేస్తారు.

2. గుడ్లు

కోడిగుడ్లలో ఉండే ప్రోటీన్లు మన శరీరానికి కావల్సిన శక్తినిస్తాయి. ఉడకబెట్టిన గుడ్లను లేదా ఆమ్లెట్లను ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకుంటే ఫలితం ఉంటుంది. దీని వల్ల శరీరానికి కావల్సిన పోషకాలు కూడా లభిస్తాయి. రోజంతా యాక్టివ్‌గా ఉండవచ్చు.

3. కివీ

కివీ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది మన శరీరాన్ని యాక్టివ్‌గా ఉండేలా చేస్తుంది. తరచూ ఈ పండ్లను తింటే యాక్టివ్‌గా ఉండవచ్చు. అలాగే ఎంత పనిచేసినా త్వరగా అలసి పోకుండా ఉంటారు.

4. అవిసెలు

అవిసె గింజల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర రోగ నిరోధక శక్తిని పెంచడంతోపాటు శరీరానికి శక్తిని అందిస్తాయి. రోజంతా యాక్టివ్‌గా ఉండేందుకు ఉపయోగపడతాయి.

5. బాదంపప్పు

బాదంపప్పులో మన శరీరానికి కావల్సిన ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. అలాగే ఇతర పోషకాలు కూడా ఉంటాయి. ఇవి మన శరీరానికి శక్తిని అందిస్తాయి.

6. టమాటా జ్యూస్

టమాటా జ్యూస్‌ను నిత్యం తాగడం అలవాటు చేసుకున్నా రోజంతా యాక్టివ్‌గా ఉండవచ్చు. అలాగే శరీర రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

2615
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles