9 నెలల చిన్నారిపై అత్యాచారం.. హత్య

Wed,June 19, 2019 12:58 PM

వరంగల్‌ : మానవత్వం మంటగలిసింది. ముక్కుపచ్చలారని 9 నెలల చిన్నారి పట్ల ఓ యువకుడు మృగంలా ప్రవర్తించాడు. ఆ చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేశాడు. ఈ దారుణ సంఘటన హన్మకొండ మండలంలోని టైలర్‌ స్ట్రీట్‌లో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. జక్కోజీ జగన్‌, రచన దంపతులకు మూడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి 9 నెలల పాప శ్రిత ఉంది. అయితే తమ కూతురితో కలిసి జగన్‌, రచన దంపతులు తాము నివాసముంటున్న ఇంటిపై నిద్రిస్తున్నారు. ఈ సమయంలో పాప శ్రితను కోలేపాక ప్రవీణ్‌(28) అనే యువకుడు ఎత్తుకెళ్లి అత్యాచారం చేశాడు. అంతటితో ఆగకుండా ఆ శిశువును హత్య చేశాడు. ఆ తర్వాత చిన్నారిని తల్లిదండ్రుల వద్ద పడుకోబెట్టి పరారయ్యాడు. అపస్మారకస్థితిలోకి వెళ్లిన చిన్నారిని తల్లిదండ్రులు మ్యాక్స్‌కేర్‌ ఆస్పత్రికి తరలించారు. చిన్నారిని పరీక్షించిన వైద్యులు ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. పాప మృతదేహాన్ని వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. నిందితుడు ప్రవీణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని, బహిరంగంగా ఉరితీయాలని పాప కుటుంబ సభ్యులు, బంధువులు డిమాండ్‌ చేస్తున్నారు.

4367
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles