భార్య ఎంపీటీసీ.. భర్త జెడ్పీటీసీ

Wed,June 5, 2019 08:03 AM

a couple wins in MPTC and ZPTC Elections

మహబూబ్‌నగర్ జిల్లా కోయిలకొండ మండలంలో జరిగిన ప్రాదేశిక ఎన్నికల్లో భార్యాభర్తలు ఘన విజయం సాధించారు. మంగళవారం వెల్లడించిన ఫలితాలలో టీఆర్‌ఎస్ జెడ్పీటీసీగా విజయ్‌భాస్కర్ గెలుపొందగా.. ఆయన భార్య నిరూపమరాణి చంద్రాసుపల్లి ఎంపీటీసీగా 358 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, స్థానిక ఎమ్మెల్యే ఎస్ రాజేందర్ రెడ్డి మండలానికి చేసిన అభివృద్ధే ఈ ఎన్నికల్లో గెలుపుకు ఉపయోగపడ్డాయని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే సహకారంతో మండల అభివృద్ధికి కృషి చేస్తామని, తమకు ఓటేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు చెబుతున్నామని ఆ దంపతులు పేర్కొన్నారు.

4791
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles