57 ఏళ్లు నిండిన వారికి వృద్ధాప్య పెన్షన్‌.. త్వరలోనే అమలు

Mon,September 9, 2019 01:22 PM

హైదరాబాద్‌ : రాష్ట్రంలోని పేద ప్రజలకు అందించే ఆసరా పెన్షన్లు, కేసీఆర్‌ కిట్స్‌, కల్యాణలక్ష్మి, ఆరోగ్య లక్ష్మి, ఆరు కిలోల బియ్యం లాంటి సంక్షేమ పథకాలకు ఎలాంటి నిధుల కొరత రానివ్వమని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. ఆసరా పెన్షన్లను రెట్టింపు చేశాం. వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులు, బోదకాల బాధితులు, ఒంటరి మహిళలు, నేత-గీత కార్మికులు, ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్తుల పెన్షన్‌ను రూ. వెయ్యి నుంచి రూ. 2,016కు పెంచాం. వికలాంగులు, వృద్ధ కళాకారుల పెన్షన్‌ను రూ. 1500 నుంచి రూ. 3,016కు పెంచాం. అయితే ఆసరా పెన్షన్ల ప్రయోజనాలు మరింత విస్తృత పరిధిలో అందించడం కోసం ప్రభుత్వం మరో రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నదని సీఎం స్పష్టం చేశారు. వృద్ధాప్య పెన్షన్‌ వయో పరిమితిని 65 సంవత్సరాల నుంచి 57 సంవత్సరాలకు తగ్గించాం. త్వరలోనే 57 సంవత్సరాలు నిండిన వారందరికీ వృద్ధాప్య పెన్షన్‌ లభిస్తుంది. బీడీ కార్మికుల పీఎఫ్‌ కటాఫ్‌ డేట్‌ను కూడా ప్రభుత్వం తొలగించిందని తెలిపారు. ఆసరా పెన్షన్ల కోసం ఈ బడ్జెట్‌లో రూ. 9,402 కోట్లు కేటాయించామని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు.

3171
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles