హత్య కేసులో నిందితులు అరెస్ట్

Thu,October 10, 2019 02:58 PM

మహబూబ్‌నగర్: జిల్లాలోని సి.సి.కుంట మండలం మద్ధూరులో గత నెల 23న ఆంజనేయులు(40) అనే వ్యక్తి హత్య జరిగింది. తమ కుమారుడు కనిపించడం లేదంటూ మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పోలీసుల విచారణలో ఆంజనేయులుని హత్య చేసిన నిందితులు పొలంలో పూడ్చిపెట్టారని తేలింది.


హత్య కేసులో నిందితులైన మృతుని భార్య, ఆమె ప్రియుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతులు పాన్‌గల్ మండలం కేతేపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి.. శవాన్ని తవ్వి తీసిని పోలీసులు సంఘటనా స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించారు.

468
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles