సీఎం కేసీఆర్ చిత్రపటానికి సినీ నటుడు కాదంబరి కిరణ్ పాలాభిషేకం

Sun,June 23, 2019 07:46 PM

హైదరాబాద్: అతి తక్కువ సమయంలోనే కాళేశ్వరం ప్రాజెక్టును అద్భుతంగా నిర్మించి జాతికి అంకితం చేసిన సీఎం కేసీఆర్‌ను తెలుగు సినీ రంగానికి చెందిన ప్రముఖులు ప్రశంసిస్తున్న విషయం విదితమే. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని ఫిలింనగర్‌లో కేసీఆర్ చిత్రపటానికి సినీ నటుడు కాదంబరి కిరణ్ ఇవాళ పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు ఎన్.శంకర్‌తోపాటు జూబ్లీహిల్స్ కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ, చిత్రపురి కాలనీ సంఘ సభ్యుడు వల్లభనేని అనిల్‌కుమార్‌లు పాల్గొన్నారు. వీరు కేసీఆర్ చిత్ర పటాన్ని పాలతో అభిషేకించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో సీఎం కేసీఆర్ పేరు చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ప్రజలకు మేలు చేయాలనే తపనతోనే సీఎం కేసీఆర్ ఆ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేశారన్నారు. ఆయన నేతృత్వంలో బంగారు తెలంగాణ సాధనలో తామూ భాగస్వాములమవుతామని తెలిపారు.

3159
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles