సినీ నటుడు శివాజీని అదుపులోకి తీసుకున్న పోలీసులు

Wed,July 3, 2019 09:53 AM

actor Shivaji arrested in Alanda Media Case

హైదరాబాద్‌ : సినీ నటుడు శివాజీని శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో సైబరాబాద్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం శివాజీని సైబరాబాద్‌ క్రైమ్‌ పోలీసు స్టేషన్‌కు తరలించారు. అలంద మీడియా కేసుకు సంబంధించి శివాజీని అదుపులోకి తీసుకున్నామని, ఈ కేసులో ఆయనను విచారిస్తామని పోలీసులు తెలిపారు. శంషాబాద్ నుంచి అమెరికాకు వెళ్లేందుకు శివాజీ ప్రయత్నిస్తుండగా ఆయనను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెప్పారు. శివాజీకి ఇంతకు ముందే లుకౌట్ నోటీసులు పోలీసులు జారీ చేయడంతో.. ఇమ్మిగ్రేషన్ అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు ఎయిర్ పోర్టు చేరుకుని శివాజీని అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 11న విచారణకు హాజరు కావాలని శివాజీకి పోలీసులు నోటీసులు ఇవ్వనున్నారు.

టీవీ9 షేర్ల వివాదానికి సంబంధించి తనపై నమోదైన కేసును కొట్టివేయాలని శివాజీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఏబీసీఎల్ 40వేల షేర్ల కొనుగోలు కోసం రవిప్రకాశ్‌కు గత సంవత్సరం ఫిబ్రవరి 19న రూ.20లక్షలు బ్యాంకు ద్వారా చెల్లించానని..అయితే ఎన్‌సీఎల్‌టీలో వివాదం తర్వాత షేర్లు బదిలీ చేస్తానని రవిప్రకాశ్‌ చెప్పారని శివాజీ పేర్కొన్నారు. రవిప్రకాశ్‌తో లావాదేవీలు కుట్ర పూరితమని వచ్చిన ఫిర్యాదు మేరకు సైబరాబాద్ పోలీసులు తనపై కేసు నమోదు చేశారని శివాజీ తెలిపారు. కనీసం విచారణ జరపకుండా పోలీసులు కేసు నమోదు చేశారని..తనపై ఎఫ్ఐఆర్‌ను కొట్టివేయాలని శివాజీ కోరారు.

5713
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles