ఆర్టీసీ ఆర్థికస్థితిగతులపై హైకోర్టులో అఫిడవిట్ దాఖలు

Fri,November 1, 2019 03:25 PM


హైదరాబాద్: ఆర్టీసీ సమ్మెపై ఇవాళ హైకోర్టులో వాదనలు జరిగాయి. ఆర్థిక స్థితిగతులపై ఆర్టీసీ యాజమాన్యం అఫిడవిట్ దాఖలు చేసింది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం నుంచి రాయితీల సొమ్ము రూ.644.51 కోట్లు రావాల్సి ఉండగా..మొత్తం సొమ్మును ప్రభుత్వం విడుదల చేసిందని యాజమాన్యం అఫిడవిట్ లో పేర్కొంది. హైదరాబాద్ లో బస్సులు నడుపుతున్నందుకు రూ.1786.06 కోట్లు చెల్లించాలని జీహెచ్ ఎంసీకి ఆర్టీసీ విజ్ఞప్తి చేసింది. 2015-16, 2016-17 లో కలిపి రెండేళ్లలో జీహెచ్ఎంసీ రూ.336.40 కోట్లు విడుదల చేసింది. మిగతా సొమ్ము చెల్లించే స్థోమత లేదని జీహెచ్ఎంసీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిందని ఆర్టీసీ అఫిడవిట్ లో తెలిపింది. ఆర్టీసీలో నిర్వహణ, డీజిల్ భారం ఎక్కువగా ఉంటోంది. నిర్వహణ వ్యయం వల్లే నష్టం వాటిల్లుతోంది. ప్రభుత్వ సాయం అందుతున్నప్పటికీ ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. సమ్మె కాలంలో రూ.82 కోట్ల నష్టం వాటిల్లిందని ఆర్టీసీ యాజమాన్యం అఫిడవిట్ లో పేర్కొంది.

1333
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles