అల్లీపూర్ చెక్‌డ్యాం ప్రారంభం.. డ్యాంలో ఈత కొట్టిన ఎమ్మెల్యే

Fri,September 6, 2019 05:16 PM

Alipur check dam starts today which is in wanaparthy district

వనపర్తి: జిల్లాలోని చిన్నచింతకుంట మండలం అల్లీపూర్‌లో రూ. 5.50 కోట్ల రూపాయలతో నిర్మించిన చెక్ డ్యామ్‌ను శుక్రవారం ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, శాట్స్ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.
నెరవేరిన కల...
ఎన్నో ఏళ్లుగా కరువుతో అల్లాడుతున్న అల్లీపురం గ్రామంలో చెక్ డ్యామ్ ఏర్పాటు ద్వారా సమీపంలోని బోర్లు, బావులు రీచార్జ్ అయ్యేందుకు అవకాశం ఏర్పడిందని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. సమీప గ్రామాల ప్రజలకు తాగునీటి కోసం సైతం ఈ చెక్ డ్యాం మినీ రిజర్వాయర్ లా ఉపయోగపడుతుందన్నారు. స్థానికులకు ఎన్నో ఏళ్ల కల అయిన చెక్ డ్యాం నిర్మాణం పూర్తయినందుకు సంతోషంగా ఉందన్నారు. చెక్ డ్యాం నిర్మాణంతో వృథాగా పోయే నీళ్లను ఒడిసిపడుతుండటంతో రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు.
డ్యాంలో ఈత కొట్టిన ఎమ్మెల్యే..
అల్లీపూర్ చెక్ డ్యాం నిండి జలధారల ఉప్పొంగుతూ పారుతున్న దృశ్యాలను చూసిన ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి స్థానికులతో కలిసి చెక్ డ్యాంలో ఈత కొట్టారు. స్థానిక యువకులతో కలిసి ఆనందాన్ని పంచుకున్నారు. తెలంగాణ వస్తే ఏమొచ్చింది అన్న వాళ్లకు సమాధానం ఈ నీళ్ళే అన్నారు. కరువు పీడిత గ్రామాన్ని సస్యశ్యామలం చేసిన ఘనత సీఎం కేసీఆర్ దేనని పేర్కొన్నారు.

1708
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles