చేపప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు పూర్తి...

Sat,June 8, 2019 07:44 AM

All arrangements made for fish Prasadam distribution

హైదరాబాద్ : మృగశిర కార్తెను పురస్కరించుకుని బత్తిని మృగశిర ట్రస్ట్ పంపిణీ చేసే చేప ప్రసాదం పంపిణీకి సర్వం సిద్ధమైంది. ఈ రోజు సాయంత్రం 6 గంటల నుంచి ప్రారంభమై ఆదివారం సాయంత్రం వరకు 24 గంటలపాటు పంపిణీ కొనసాగనున్నది. చేప ప్రసాదం పొందేందుకు తెలంగాణ,ఏపీ నుంచే కాకుండా పొరుగు రాష్ర్టాల నుంచి పెద్ద సంఖ్యలో ఆస్తమా, ఉబ్బసం వ్యాధిగ్రస్థులు వస్తున్నారు. వికలాంగులు, వృద్ధులు, మహిళలు, పిల్లల కోసం ప్రత్యేక క్యూలైన్ లు ఏర్పాటు చేశారు. ఈ సారి టోకెన్ల కోసం ప్రత్యేకంగా గ్యాలరీ ఏర్పాటు చేశారు. ఇప్పటికే చాలా మంది ఎగ్జిబిషన్ మైదనానికి చేరుకొని చేప ప్రసాదం కోసం ఎదురుచూస్తున్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తుండటంతో ప్రభుత్వం భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. బ్యారికేడ్లు, క్యూలైన్లు, షెడ్ల నిర్మాణం, విద్యుత్ ఫ్లడ్‌లైట్లు బిగింపు వంటి ఏర్పాట్లను సిద్ధంచేశారు. ఉబ్బసం, ఆస్తమా వ్యాధికి ఔషధంగా భావించి దాన్ని పొందేందుకు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఉత్తరాది రాష్ర్టాల నుంచి వ్యాధిగ్రస్థులు వస్తారు. ఇప్పటికే పెద్ద సంఖ్యలో జనం తరలిరావడంతో ఎగ్జిబిషన్ మైదానం పరిసరాలన్నీ నిండిపోయాయి.

866
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles