28న మరో అల్పపీడనం

Sun,August 25, 2019 04:54 AM

another low pressure on the 28th in bay of bengal

ఒడిశా, పశ్చిమబెంగాల్ తీరాలకు దగ్గరలో వాయవ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉదయం ఒడిశాకోస్తా, దాని పరిసరప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నది. ఉత్తర బంగాళాఖాతం, దాని పరిసరాల్లో ఆగస్టు 28న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నదని వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు. రాగల 24గంటల్లో రాష్ట్రంలోని చాలాచోట్ల తేలికపాటినుంచి మోస్తరు వానలు.. ఉత్తర, తూర్పు తెలంగాణలోని కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీవర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు.

3263
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles