పురాతన బంగారం నాణేలంటూ మోసం

Tue,November 5, 2019 09:38 AM

హైదరాబాద్ : వ్యవసాయ క్షేత్రంలో పురాతన బంగారం నాణేలు, మహవీర్ జైన్ విగ్రహం దొరికిందని.. వీటిని తక్కువ ధరకు విక్రయిస్తామని మోసం చేసిన ఉత్తర్‌ప్రదేశ్ ముఠాను హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ పోలీ స్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసి న విలేకరుల సమావేశంలో సీపీ అంజనీకుమార్ వివరాలు వెల్లడించారు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన అర్జున్‌సింగ్, మ హ్మద్ కల్లు స్నేహితులు. మహ్మద్ కల్లు ఛత్రినాక పరిధిలో నివాసం ఉంటూ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల సొంత గ్రామం ఉత్తర్‌ప్రదేశ్‌కు వెళ్లినప్పుడు అర్జున్‌సింగ్ కలిశాడు.


అతను తన వద్ద కొన్ని రాగికి బంగారం పూత పూసిన నాణేలు ఉన్నాయని, ఓ మహవీర్ జైన్ విగ్రహం ఉందని... వీటిని పురాతన బంగారం నాణేలుగా నమ్మించి విక్రయిద్దామని చెప్పాడు. దీంతో మహ్మద్ కల్లు ఆగస్టులో అంబర్‌పేట్ ప్రాంతంలో శ్రీరామ్‌దాస్ సంజీవ చారిని కలిసి ఈ నాణేలు, మహవీర్ జైన్ విగ్రహం గురించి చెప్పాడు. ఇవి స్నేహితుడు పొలంలో దొరికాయని ... డబ్బు అత్యవసరంగా అవసరం ఉందని చెప్పి నమ్మించాడు.

అయితే వాటిని కొనుగోలు చేయడానికి సంజీవచారి సిద్ధం కాగానే కల్లు.. అర్జున్ సింగ్‌ను పిలిపించాడు. మొదట అతనికి 10 గ్రాముల అసలు బంగారం నాణేన్ని చూపించి మాయ చేశారు. ఇది నిజమేనని నమ్మిన సంజీవ చారి మొత్తం 3.8 కేజీలుగా చెప్పిన 380 బంగారం పూత పూసిన కాయిన్స్, మహవీర్ జైన్ విగ్రహాన్ని అతనికి ఇచ్చి దాదాపు రూ.13.45 లక్షలను తీసుకున్నారు. ఆ తర్వాత వాటిని పరిశీలించగా.. అవి బంగారం పూత పూసిన నాణేలుగా గుర్తించి మోసపోయానని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

దీనిపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దృష్టి సారించారు.. కాగా.. నకిలీ నాణేలను విక్రయించేందుకు వచ్చిన మహ్మద్ కల్లు, అర్జున్ సింగ్ పోలీసులకు దొరికిపోయారు. వీరి వద్ద నుంచి రూ.9 లక్షల విలువ చేసే 380 రాగి నాణేలు, మహవీర్ జైన్ విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్నారు. విచారణలో వీటిని యూపీ అలీఘర్ మార్కెట్‌లో కొనుగోలు చేసినట్లు నిందితులు వెల్లడించారు. ఈ ముఠాను పట్టుకున్న టాస్క్‌ఫోర్స్‌పోలీసులను సీపీ అభినందించారు.

513
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles