నాటుకోళ్ల యూనిట్ కోసం దరఖాస్తు చేసుకోండి...

Mon,November 4, 2019 12:10 PM

హైదరాబాద్: రాష్ట్రంలోనే ప్రప్రథమంగా జిల్లాలలో ఎలాంటి ఆసరా లేని ఎస్సీ, బీసీ-సీ మహిళలకు ఉపాధి కల్పించేందుకు జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నాటుకోళ్ల పెంపకం యూనిట్లకు శ్రీకారం చూట్టనున్నారు. త్వరలో 200 గ్రామాల్లో గ్రామంలో ఒకరికి మొదటగా పైలెట్ ప్రాజెక్టు ద్వారా నాటుకోళ్లను పంపిణీ చేసి, తద్వారా జిల్లా మొత్తం అమలు చేసేందుకు చర్యలు తీసుకోనున్నారు. ఇందులో 21 నుంచి 60 వయస్సు ఉన్న ఎలాంటి ఆసరా లేని ఎస్సీ, బీసీ- సి మహిళలు ఇందుకు అర్హులుగా గుర్తించనున్నారు. ఇందుకు గ్రామ సభ ఆమోదం తప్పనిసరిగా ఉంటుంది. ఇందులో ఎస్సీ కార్పొరేషన్, వెటర్నరీ, ఉపాధి హామీ శాఖల సమన్వయంతో ఈ నాటు కోళ్ల పెంపకానికి చర్యలు తీసుకొని కార్యాచరణను ముందుకు నడిపేందుకు మార్గదర్శకాలను సిద్ధం చేశారు. ఇందుకు ఎంపిక ప్రక్రియకు ఎంపీడీవో, వెటర్నరీ డాక్టర్, ఏపీఎంలు, కృషి విజ్ఞాన్ కేంద్రం సభ్యులు, కమిటీలో ఉంటారు.


వీరందరి ఎంపిక ద్వారానే లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. ఇందుకు దరఖాస్తు చేసుకునే వారికి ఇంటి పక్కన విశాలమైన స్థలం లేదా 3 నుంచి 10 గుంటల భూమి కలిగి ఉండాలి. యూనిట్ కాస్ట్ రూ.50వేలుగా నిర్ణయించి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా వీరికి యూనిట్‌కు 120 కోళ్లను మంజూరు చేయడంతో పాటు ఇందులో విద్యుత్, మెడిసెన్, ఆహారంకు సంబంధించి వెచ్చించేందుకు చర్యలు తీసుకున్నారు. తదనంతరం పెంపకం దారులకు రూ.37వేలలతో ఫౌట్రీషెడ్‌ను ఉపాధి హామీ ద్వారా నిర్మాణం చేసేందుకు రూపకల్పన చేశారు. జిల్లాలో 565 గ్రామ పంచాయతీలు ఉండగా మొదటగా 200 గ్రామాల్లో గ్రామంలో ఒకరిని ఎంపిక చేసేందుకు అధికారులు సన్నద్ధం అవుతున్నారు. ఇందులో రూ.50వేలు పూర్తి సబ్సిడీతో ఆసరా లేని మహిళలు ఎస్సీ, బీసీ-సిలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఈ యూనిట్లను త్వరలో ప్రవేశపెట్టనున్నారు. ఉపాధి హామీ పథకంలో జాబ్‌కార్డు కలిగి ఉన్నటువంటి ఆసరా లేని మహిళలే అర్హులన్నారు.

ఈ నెల 10లోగా దరఖాస్తు చేసుకోవాలి


జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు కింద ఎలాంటి ఆసరా లేని మహిళలైన ఎస్సీ, బీసీ- సీ మహిళలకు ఆర్థికాభివృద్ధి సాధించేందుకు నాటుకోళ్ల పెంపకం యూనిట్లతో ఉపాధి కల్పించడం జరుగుతుంది. జిల్లాలో మొదటగా గ్రామానికి ఒకరిగా, 200 గ్రామాల్లో ప్రారంభించడం జరుగుతుంది. ఇందు కోసం అర్హులైనటువంటి వారు ఈ నెల 10వ తేదీలోగా ఎంపీడీవో కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కుల, ఆదాయ, రేషన్‌కార్డు, ఆధార్ కార్డు, ఫొటోలతో దరఖాస్తులు చేసుకోవాలి. ఇతర వివరాలకు కలెక్టరేట్‌లోని ఎస్సీ కార్పొరేషన్ అభివృద్ధి కార్యాలయంలో సంప్రదించాలి.

16362
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles