కేరళ, మహారాష్ట్రకు ఎంపీ ఓవైసీ ఆర్థిక సాయం

Wed,August 14, 2019 11:32 AM

Asaduddin Owaisi donates rs 10 lakhs each flood hit Kerala and Maharashtra

హైదరాబాద్‌ : భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలం అవుతున్న కేరళ, మహారాష్ట్ర రాష్ర్టాలకు తన వంతు ఆర్థిక సాయం చేసేందుకు ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ ముందుకొచ్చారు. ఈ రెండు రాష్ర్టాలకు రూ. 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేయనున్నట్లో ఓవైసీ మంగళవారం ప్రకటించారు. ఈ నగదును నేరుగా ఆయా రాష్ర్టాల చీఫ్‌మినిస్టర్‌ రిలీఫ్‌ ఫండ్‌కు జమ చేస్తామని ఓవైసీ తెలిపారు. గత కొద్ది రోజుల నుంచి కేరళ, మహారాష్ట్రతో పాటు కర్ణాటకలు భారీ వర్షాలు కురుస్తున్న విషయం విదితమే. కేరళలో ఇప్పటి వరకు 91 మంది మృతి చెందగా, 59 మంది అదృశ్యమయ్యారు. 14 జిల్లాల్లో వరద ముంపునకు గురయ్యాయి. మహారాష్ట్రలో 43 మంది ప్రాణాలు కోల్పోయారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి.

1782
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles