నర్సంపేట్ పట్టణ టీఆర్‌ఎస్ నేతపై కత్తులతో దాడి

Wed,September 18, 2019 06:24 AM

వరంగల్: జిల్లాలోని నర్సంపేట్ పట్టణ టీఆర్‌ఎస్ నేతపై కొందరు దుండగులు ఈ తెల్లవారుజామున దాడికి పాల్పడ్డారు. వరంగల్ రోడ్డులో భార్యతో కలిసి ఉదయపు నడకకు వెళ్తున్న అంబటి వెంకన్నపై దుండగులు కత్తులు, గొడ్డళ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో వెంకన్న తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం వరంగల్‌కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. భూ వివాదమే వెంకన్నపై దాడికి కారణమని సన్నిహితుల అనుమానం.

400
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles