టీబీని తరిమికొడుదాం : మంత్రి ఈటల

Wed,October 30, 2019 02:34 PM

హైదరాబాద్‌ : కామినేని అకాడమీ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌లో టీబీ(క్షయ వ్యాధి)పై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కేంద్ర మంత్రి అశ్వినికుమార్‌ చౌబే, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ.. ఏటా రాష్ట్రంలో 12 వేల మంది టీబీతో చనిపోతున్నారు. మందులు, వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నా ప్రజల్లో అవగాహన లేదు. 2025 నాటికి భారత్‌ నుంచి టీబీని తరిమికొట్టాలని నిర్ణయించారు. తెలంగాణలో అంతకంటే ముందే టీబీని తరిమికొడుదాం. ఆరేళ్ల లోపు చిన్నారులకు నెలకు 30 గుడ్లు ఇస్తున్నాం. గర్భిణులకు గుడ్లు, పాలు, 3 విడుతల్లో రూ. 12 వేలు అందిస్తున్నాం. మొబైన్‌ వ్యాన్‌లో ల్యాబ్‌లను అందుబాటులోకి తీసుకురాబోతున్నాం అని ఈటల రాజేందర్‌ తెలిపారు.

1011
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles