హెచ్‌సీఏ అధ్యక్షుడిగా మాజీ క్రికెటర్ అజారుద్దీన్ ఎన్నిక

Fri,September 27, 2019 04:56 PM

హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ సంఘం(హెచ్‌సీఏ) అధ్యక్ష ఎన్నికల్లో మాజీ కెప్టెన్ అజారుద్దీన్ ఘన విజయం సాధించారు. అజారుద్దీన్‌తో పాటు ప్రకాశ్ చంద్ జైన్, దిలీప్ కుమార్ అధ్యక్ష బరిలో నిలిచారు. హెచ్‌సీఏ ఎన్నికల్లో 227 ఓట్లకు గాను 223 ఓట్లు పోలయ్యాయి. అజారుద్దీన్ 147, ప్రకాశ్ జైన్ 73, దిలీప్ కుమార్‌కు 3 ఓట్లు వచ్చాయి. 74 ఓట్ల తేడాతో అజారుద్దీన్ ఘన విజయం సాధించారు. వైస్ ప్రెసిడెంట్‌గా అజార్ ప్యానెల్‌కు చెందిన జాన్ మనోజ్ విజయం సాధించారు. 49 ఓట్ల ఆధిక్యంతో హెచ్‌సీఏ ఉపాధ్యక్షుడిగా మనోజ్ గెలుపొందారు. ఉప్పల్ క్రికెట్ స్టేడియం ఆవరణలో అజారుద్దీన్ వర్గం సంబురాలు చేసుకుంది. 56ఏండ్ల అజారుద్దీన్ భారత్ తరఫున 99 టెస్టులు, 334 వన్డే మ్యాచ్‌లు ఆడాడు.


మాజీ కార్య‌ద‌ర్శి జాన్ మ‌నోజ్‌.. వైస్ ప్రెసిడెంట్‌గా గెలుపొందారు. ఆయ‌న‌కు 136 ఓట్లు పోల‌య్యాయి. ద‌ల్జీత్ సింగ్‌కు 87 ఓట్లు ప‌డ్డాయి. ఇక కార్య‌ద‌ర్శి పోస్టుకు ఆర్ విజ‌యానంద్ ఎంపిక‌య్యారు. ఆయ‌న‌కు 137 ఓట్లు ప‌డ్డాయి. రెండ‌వ స్థానంలో ఆర్ వెంక‌టేశ్వ‌ర‌న్ 75 ఓట్ల‌తో నిలువ‌గా, ఆర్ఎం భాస్క‌ర్‌కు 24 ఓట్లు ప‌డ్డాయి. జాయింట్ సెక్ర‌ట‌రీ పోస్టును న‌రేశ్ శ‌ర్మ గెలుచుకున్నారు. ఆయ‌న‌కు 130 ఓట్లు ప‌డ్డాయి. శివాజీ యాద‌వ్‌కు 82 ఓట్లు పోల‌య్యాయి. కొత్త ట్రెజ‌ర‌ర్‌గా సురేంద‌ర్ అగర్వాల్ గెలిచారు. ఆయ‌న‌కు 141 ఓట్లు పోల‌య్యాయి. హ‌న్మంత రెడ్డిపై ఆయ‌న గెలుపొందారు. కౌన్సుల‌ర్‌గా ఏకైక మ‌హిళా అభ్య‌ర్థి పి. అనురాధ గెలిచారు. ర‌వీంద‌ర్ సింగ్‌పై ఆమె గెలిచారు.

1835
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles