శ్మశాకవాటికలో పూజలు చేసిన బురిడీబాబా అరెస్ట్‌

Mon,September 23, 2019 09:54 AM

చార్మినార్‌ : అమాయక ప్రజలను మోసం చేస్తూ మాయ మంత్రాలంటూ ప్రత్యేక పూజలు చేస్తున్నట్లు నటిస్తూ స్థానిక ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న ఓ వ్యక్తిని హుస్సేనిఅలం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇన్‌స్పెక్టర్‌ రమేశ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. హుస్సేనిఅలం ప్రాంతానికి చెందిన టిప్పు సుల్తాన్‌, అలియాస్‌ టిప్పు బాబా(45)మహారాష్ట్రలోని పర్బానీ ప్రాంతానికి చెందిన వ్యక్తి. గత కొన్నేండ్లుగా హుస్సేనిఅలం ప్రాంతంలో నివసిస్తూ తాంత్రీక శక్తులు ఉన్నాయని ప్రచారం చేసుకుంటూ అమాయక ప్రజలను మోసం చేస్తున్నాడు.


ఇటీవల వెళ్లిపోయిన పౌర్ణమి రోజున పురాణపూల్‌ శ్మశాకవాటికలో రాత్రి సమయంలో ప్రత్యేక పూజలంటూ పెద్దగా హాహాకారాలు చేస్తూ ప్రజలు భయపడేలా తాంత్రీక పూజలు నిర్వహించారు. దీనిపై స్థానిక ప్రజలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో టిప్పు బాబాను అదుపులోకి తీసుకున్నారు. తన వద్దకు వచ్చే బాధితులను బెదిరించి వీడియోలు తీసేవాడని గుర్తించారు. పూజలకు ఉపయోగించే పలు వస్తువులను, వీడియోలను స్వాధీనం చేసుకున్నామని ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు. నిందితున్ని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలిస్తున్నామని తెలిపారు.

1180
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles