బాలాపూర్ గణేశుడి శోభాయాత్ర షురూ

Thu,September 12, 2019 09:42 AM

Balapur ganesh shobha yatra started


హైదరాబాద్ : బాలాపూర్ గణేశుడి శోభాయాత్ర ప్రారంభమైంది. ముందుగా బాలాపూర్ లో గణపతి విగ్రహం ఊరేగింపు కార్యక్రమం చేపట్టనున్నారు. ఈ మేరకు గ్రామోత్సవం కోసం గణపతిని ఉత్సవ సమితి వాహనంపైకి చేర్చింది. గ్రామోత్సవం అనంతరం లడ్డూ వేలంపాట నిర్వహించనున్నారు. 18 కిలోమీటర్ల మేర ట్యాంక్ బండ్ వైపు బాలాపూర్ గణేశుడి శోభాయాత్ర కొనసాగనుంది.

సాయంత్రం 4.30 గంటల లోపు బాలాపూర్ గణేశుడి నిమజ్జనం జరుగుతుందని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. అనుమానా స్పద వ్యక్తులు, వస్తువులు, ఇతర సమాచారం ఉంటే వెంటనే వాటిని డయల్‌ 100 లేదా రాచకొండ వాట్సాప్‌ 9490617111కు సమాచారం అందించాలని కోరారు. ముఖ్యంగా వదంతులు, సోషల్‌ మీడియా, వాట్సాప్‌లలో వచ్చే సమాచారాన్ని ఎవరూ నమ్మవద్దని తెలిపారు.

778
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles