పటాకులు పేల్చుతున్నారా.. జాగ్రత్త!

Tue,November 6, 2018 07:07 AM

హైదరాబాద్: దీపావళి పండుగ రోజున ప్రతి ఒక్కరూ తప్పని సరిగా జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. దీపావళి రోజున ప్రధానంగా చిన్న పిల్లలు పటాకులు కాల్చే ముందు కాటన్ దుస్తులు దరించాలన్నారు. సిల్క్, నైలాన్, సింతటిక్ దుస్తులు దరించకూడదని తెలిపారు. పెద్దల పర్యవేక్షణలోనే పటాకులు కాల్చాలన్నారు. చిచ్చుబుడ్డీలు, రాకెట్‌లు, పటాకులు చేతిలో ఉంచుకొని కాల్చరాదని తెలిపారు. పటాకులు కాల్చే ప్రదేశంలో నీరు అందుబాటులో ఉంచుకోవడమే కాకుండా.. ఇంటి దగ్గర కాకుండా ఓపెన్ గ్రౌండ్‌లో కాల్చడం మంచిదని సూచించారు. ప్రధానంగా విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్, కరెంటు తీగలు ఉండే స్థలాలలో కాల్చవద్దు. కంటి అద్దాలు, కాళ్ళకు పాదరక్షకలు, చెవులో దూది ఉంచుకొని పేల్చాలని తెలిపారు.

1513
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles