భద్రాద్రిలో బాలోత్సవ్ షురూ..

Fri,November 15, 2019 09:00 PM

భద్రాచలం: భద్రాచలం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో తాళ్లూరి పంచాక్షరయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 'భద్రాద్రి బాలోత్సవం' 2019 జాతీయ స్థాయి బాలల పండుగ శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. స్థానిక ఎమ్మెల్యే పొదెం వీరయ్యతో కలిసి భద్రాచలం ఐటీడీఏ పీవో వీపీ గౌతమ్ ముందుగా పతాకాన్ని ఆవిష్కరించి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... విద్యార్థుల్లో దాగి ఉండే సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఇటువంటి బాలోత్సవం కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు. వివిధ అంశాల్లో బాల, బాలికలు పోటీ పడి బహుమతులు పొందారు. కార్యక్రమంలో తాళ్లూరి పంచాక్షరయ్య చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ తాళ్లూరి పంచాక్షరయ్య మాట్లాడుతూ మరో రెండు రోజులు బాలోత్సవ్ జరుగుతుందన్నారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు పలు పోటీల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో తానా అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్, పంచాక్షరయ్య ట్రస్ట్ కన్వీనర్ ఎన్‌సీహెచ్ చక్రవర్తి, కార్యదర్శి వల్లూరిపల్లి వంశీకృష్ణ, ఐటీసీ ప్రతినిధి చెంగల్‌రావు, పాకాల దుర్గాప్రసాద్, తిప్పన సిద్దులు, గాదె మాధవరెడ్డి, అల్లం నాగేశ్వరరావు, నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.

287
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles