రాష్ట్రవ్యాప్తంగా బ్లాక్ చైన్ టెక్నాలజీ

Tue,April 23, 2019 06:54 AM

Blockchain to the rescue of Telangana chit business

హైదరాబాద్, : రాష్ట్రంలో చిట్‌ఫండ్ మోసాలకు చెక్‌పెట్టేందుకు అధికారులు కసరత్తు ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటికే మూడుచోట్ల అమలులో ఉన్న బ్లాక్ చైన్ టెక్నాలజీని రాష్ట్రవ్యాప్తంగా అమలుచేసే దిశగా చర్యలు చేపట్టారు. ఇందుకు సంబంధించిన టీ-చిట్ యాప్‌ను జూన్‌నాటికి అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రంలోని చిట్‌ఫండ్ కంపెనీలు చీటీ పాడిన ఫ్రైజ్ బిడ్డర్లకు సకాలంలో డబ్బులు చెల్లించక, నిబంధనలను పాటించని వాటిని కట్టడి చేయడానికి ఇటీవల ప్రయోగాత్మకంగా అమలులోకి తెచ్చిన బ్లాక్ చైన్ టెక్నాలజీ విజయవంతమైంది. రాష్ట్రవ్యాప్తంగా 14 అసిస్టెంట్ చిట్ రిజిస్ట్రార్ కార్యాలయాలుండగా ఇప్పటికే రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరిలలో ఈ టెక్నాలజీని వాడుతున్నారు. దీంతో చిట్‌ఫండ్ కంపెనీల ట్రాక్ రికార్డు మొత్తం కండ్లకు కట్టినట్లుగా ఉంటున్నది. చిట్‌ఫండ్ కంపెనీలు ఎంత ప్రైజ్‌బిడ్ పాడుతున్నాయి. బిడ్డర్‌కు సకాలంలో డబ్బు చెల్లిస్తున్నారా లేదా అనే అన్ని విషయాలు ఆన్‌లైన్‌లో ఎప్పటికప్పుడు తెలుస్తాయి. ఈ టెక్నాలజీలో వివరాలను ట్యాంపరింగ్ చేయడానికి వీలులేదు. ఒక్కసారి వివరాలు నమోదైతే అది శాశ్వతంగా రికార్డులో ఉండిపోతుంది. చిట్‌ఫండ్ కంపెనీలు ఖాతాదారులను మోసంచేయకుండా స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ నిబంధనలను కఠినతరం చేసింది. రిజిస్టర్డ్ చిట్‌ఫండ్ కంపెనీలు తమ చీటి విలువ మొత్తాన్ని డబ్బురూపంలోనే డిపాజిట్‌చేయాలని ఆదేశాలు జారీచేసింది. ఇకపై స్థిరాస్తుల తనఖా చెల్లదని స్పష్టంచేసింది.

1503
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles