బీటీ-3 పత్తి విత్తనాలను విక్రయిస్తే ఏడేండ్ల జైలు శిక్ష

Sat,March 23, 2019 06:31 AM

BT 3 cotton seeds were sold to seven years imprisonment

మేడ్చల్ : జీవవైవిధ్యంను దెబ్బతీస్తున్న బీటీ-3 పత్తి విత్తనాల విక్రయించిన వారికి ఏడేండ్ల జైలుశిక్ష పడుతుందని మేడ్చల్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారిణి శోభారాణి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విత్తనాల విక్రయంను వెంటనే నిలిపివేయాలని జిల్లా పరిధిలోని విత్తన డీలర్లకు సూచించారు. బీటీ-3 పత్తి విత్తనాలను సాగుచేస్తే వాటికి ైగ్లెఫోసీట్ రసాయనం వినియోగించాల్సి ఉంటుందని, దీంతో జీవవైవిద్యం దెబ్బతినడంతో పాటు ప్రమాధకరమైన క్యాన్సర్ సోకే అవకాశం ఉందని ఆమె తెలిపారు. బీటీ-3 పత్తి విత్తనాలను విక్రయించిన వారికి పర్యావరణ పరిరక్షణ చట్టం - 1986 ప్రకారం సుమారు ఏడేండ్ల వరకు జైలుశిక్షతో పాటు సుమారు రూ.లక్ష వరకు జరిమాన పడుతుందన్నారు. ఈ విషయంను గుర్తుపెట్టుకొని మేడ్చల్ జిల్లా పరిధిలోని డీలర్లు, విత్తన కంపెనీలు, బీటీ - 3 పత్తివిత్తనాలను తయరుచేసే పరిశ్రమలు వీటిని ఉత్పత్తి చేసినా, నిల్వచేసినా, విక్రయించిన శిక్షకు అర్హులవుతారని హెచ్చరించారు. రైతులు కూడా పత్తి విత్తనాలను అధీకృత డీలర్ల వద్ద కొనుగోలు చేయాలని, అలాగే వారి నుంచి కొనుగోలు రశీదును పొందాలని సూచించారు. రైతులు ఎట్టి పరిస్థితుల్లోను బీటీ-3 పత్తి విత్తనాలను సాగు చేయవద్దని ఆమె సూచించారు.

1832
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles