కోడెల శివప్రసాద్ మృతిపై కేసు నమోదు

Mon,September 16, 2019 05:13 PM

హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావు అనుమానాస్పద మృతిపై కేసు నమోదు చేసినట్లు నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు. బంజారాహిల్స్ ఏసీపీ ఆధ్వర్యంలో మూడు బృందాలతో దర్యాప్తు జరుపుతున్నామని చెప్పారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత శివప్రసాద్‌రావు మృతిపై స్పష్టత వస్తుందన్నారు. క్లూస్ టీం, టెక్నికల్ బృందాలు కూడా దర్యాప్తు చేస్తున్నాయని సీపీ పేర్కొన్నారు. పోస్టుమార్టం నిమిత్తం శివప్రసాద్ మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రి మార్చురికీ తరలించారు.


హైదరాబాద్‌లోని కోడెల నివాసంలో ఆయన బలవన్మరణానికి పాల్పడినట్లు సమాచారం. ఉదయం 11 గంటల సమయంలో తలుపు తీయకపోవడంతో కిటికీలోంచి చూడగా ఉరివేసుకుని కనిపించారు. కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన బంజారాహిల్స్ లోని బసవతారకం ఆస్పత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. చికిత్స పొందుతూ కోడెల తుదిశ్వాస విడిచారు.

1433
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles