శాసనసభలో సభ్యుల సీట్ల మార్పు

Mon,September 9, 2019 03:18 PM

హైదరాబాద్‌ : తెలంగాణ శాసనసభలో సభ్యుల సీట్ల మార్పు జరిగింది. రెండో అతిపెద్ద పార్టీ మజ్లిస్‌కు ప్రతిపక్ష నేత వైపు ఉన్న సీట్లను కేటాయించారు. శాసనసభలో మజ్లిస్‌కు ఏడుగురు శాసనసభ్యులు ఉన్నారు. దీంతో మజ్లిస్‌ సభ్యులకు ముందు వరుసలో సీట్లను కేటాయించారు. రెండో వరుసలో భట్టి విక్రమార్కకు సీటు కేటాయించారు అధికారులు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ మొత్తం 19 స్థానాలను గెలుచుకుని రెండో అతిపెద్ద పార్టీగా నిలిచి ప్రతిపక్ష హోదాను పొందింది. ఆ తర్వాత 12 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌ఎల్పీలో విలీనం అయ్యారు. దీంతో కాంగ్రెస్‌ సంఖ్యా బలం ఏడుకు పడిపోయింది. ఇక ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ఎంపీగా గెలవడంతో హుజుర్‌నగర్‌ శాసనసభ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో కాంగ్రెస్‌ సంఖ్య ఆరుకు చేరింది. ఏడు స్థానాలున్న ఎంఐఎం రెండో అతిపెద్ద పార్టీగా నిలిచింది. కాంగ్రెస్‌ కంటే ఎంఐఎంకు ఎక్కువ సంఖ్యా బలం ఉండడంతో నిబంధనల మేరకు సీట్లను మార్పు చేశారు. తెలంగాణలో మొత్తం 119 శాసనసభ స్థానాలు ఉన్నాయి.

3194
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles