స్వచ్ఛ, ఆరోగ్య గ్రామాలుగా మారాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యం

Fri,September 13, 2019 04:23 PM

సిద్దిపేట: సిద్దిపేట అర్బన్ మండలం తడ్కపల్లి గ్రామంలో 30 రోజుల ప్రణాళిక సభ జరిగింది. కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...గ్రామాలన్నీ స్వచ్ఛ, ఆరోగ్య గ్రామాలుగా మారాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యం. ప్రతీ గ్రామంలో డంప్‌యార్డ్‌ను నిర్మించాలి. తడ్కపల్లిలో డంప్‌యార్డ్ నిర్మాణానికి రూ.6 లక్షలు మంజూరు చేస్తాం. గ్రామాల్లో యువకులు ప్రతి వారం శ్రమదానం చేయాలని పిలుపునిచ్చారు. తడ్కపల్లిలో యువత కోసం గ్రంథాలయం, జిమ్ ఏర్పాటు చేయిస్తా. గ్రామంలో రూ.50 లక్షలతో సీసీ రోడ్లు నిర్మిస్తామని తెలిపారు.

585
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles