మాంద్యం ఉన్నా.. సంక్షేమమే మిన్న..

Mon,September 9, 2019 01:52 PM

హైదరాబాద్‌ : దేశంలో తీవ్రమైన ఆర్థిక మాంద్యం ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమానికే పెద్దపీట వేసింది. ఆర్థిక మాంద్యం నెలకొని ఉన్నప్పటికీ, అత్యంత ప్రధానమైన వ్యవసాయ రంగానికి, ప్రజా సంక్షేమానికి అత్యధిక నిధులు కేటాయించడం ద్వారా రైతులు, పేదల జీవితాల్లో వెలుగులు తీసుకురావాలనే చిత్తశుద్ది తమ ప్రభుత్వానికి ఉందని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. పూర్తి ఆశావాహ దృక్పథంతో, వాస్తవిక పరిస్థితులన్నీ పరిగణలోకి తీసుకుని, ఎన్నికల హామీలను నెరవేరుస్తామని సీఎం చెప్పారు. ఆర్థిక మాంద్యం కారణంగా ఆదాయాలు తగ్గినప్పటికీ పరిస్థితిలో తప్పకమార్పు వస్తుందనే ఆశాభావం తనకు ఉందన్నారు సీఎం. ఇప్పుడున్న వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ఈ బడ్జెట్‌ రూపకల్పన జరిగిందన్నారు.


రానున్న రోజుల్లో పరిస్థితి మెరుగుపడి, ఆదాయం పెరిగితే అందుకు తగ్గట్టు అంచనాలు సవరించుకునే వెసులుబాటు కూడా తమకు ఉందన్నారు సీఎం. దురాక్రమణకు, కబ్జాలకు గురైన ప్రభుత్వ భూములను కాపాడడానికి, కోర్టుల్లో మగ్గుతున్న భూవివాదాలను పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం చేసిన రాజీలేని న్యాయ పోరాటాలు ఇప్పుడిప్పుడే ఫలిస్తున్నాయి. చేజారిపోతాయనున్న వేల కోట్ల రూపాయాల విలువైన భూములపై ఇప్పుడు ప్రభుత్వానికి హక్కు కలిగింది. ఈ భూములను దశల వారీగా విక్రయించడం వల్ల రాష్ర్టానికి అదనంగా ఆదాయం సమకూరుతుంది. అలా సమకూరిన ఆదాయాన్ని ఎస్‌డీఎఫ్‌కు కేటాయించి, ప్రజల అవసరాలు తీర్చే విషయంలో ఏ శాఖలో ఇబ్బంది కలిగినా, సర్దుబాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని సీఎం తెలిపారు. ఆదాయ వనరులను బట్టి ప్రభుత్వం ఎప్పటికప్పుడు తన ప్రాధాన్యతలను నిర్ణయించుకుంటూ, సవరించుకుంటూ క్రియాశీలకంగా వ్యవహరిస్తుందని సీఎం స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో పరిస్థితి మెరుగుపడి ఆదాయం పెరుగుతందని అంచనా. అన్ని శాఖల్లో ఉన్న బకాయిలు తక్షణమే చెల్లిస్తాం. బకాయిలు చెల్లించాకే కొత్త పనులు చేపట్టాలని విధానం నిర్ణయం తీసుకున్నాం. పరిమితులకు లోబడి ప్రభుత్వ మార్గనిర్దేశాల ప్రకారం నిధుల ఖర్చు. నిధుల ఖర్చుపై మంత్రులు, కార్యదర్శులకు ఆర్థిక శాఖ నుంచి స్పష్టమైన సూచనలు చేసిందని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు.

1188
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles