విజయవాడకు బయలుదేరిన సీఎం కేసీఆర్

Thu,May 30, 2019 10:50 AM

cm kcr go to vijayawada for jagan mohan reddy ote

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు విజయవాడ వెళ్లారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో కేసీఆర్ బయలుదేరారు. జగన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం విజయవాడలోని గేట్‌వే హోటల్‌కు చేరుకుంటారు. భోజనం అనంతరం మధ్యాహ్నం రెండు గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి విమానంలో ఢిల్లీకి బయల్దేరుతారు. సాయంత్రం ఏడు గంటలకు ఢిల్లీలో ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరవుతారు. సీఎం కేసీఆర్ వెంట పలువురు పార్టీ నాయకులు వెళ్లనున్నారు.

1849
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles