ఉమ్మడి నిజామాబాద్ ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్ భేటీ

Thu,September 19, 2019 04:12 PM

హైదరాబాద్: ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఛాంబర్‌లో ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని అన్ని ప్రాంతాలకు సాగు, తాగునీటి ప్రణాళికకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. సమగ్ర ప్రణాళిక రూపొందించాలని అధికారులకు ఆదేశించారు. నిజాంసాగర్, సింగూరు ప్రాజెక్టుల పరిధిలో నీటి లభ్యత తక్కువ ఉంటుంది. ఆ ప్రాజెక్టుల పరిధిలోని గ్రామాల్లో తాగునీటి ప్రణాళికలు రూపొందించండి. వచ్చే నెలలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రెండు రోజుల పాటు పర్యటించనున్నట్లు తెలిపారు. సాగు, తాగునీరు, పోడు భూముల సమస్యపై ప్రజలతో సీఎం చర్చించనున్నారు. సాగు, తాగునీటి కోసం శాశ్వత ప్రాతిపదికన కార్యక్రమాలకు సీఎం శ్రీకారం చుట్టారు.

2365
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles