కాసేపట్లో తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ!

Mon,September 23, 2019 10:33 AM

హైదరాబాద్‌ : విభజన సమస్యల పరిష్కారంపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కే చంద్రశేఖర్‌రావు, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ రోజు మరోసారి భేటీ కానున్నారు. విభజన సమస్యలన్నింటినీ సానుకూల దృక్పథంతో పరిష్కరించుకొందామన్న నిర్ణయానికి వచ్చిన ఇద్దరు ముఖ్యమంత్రులు.. గతంలో గవర్నర్‌ సమక్షంలో భేటీ అయ్యారు. అనంతరం ఖాళీగా ఉన్న ఏపీకి కేటాయించిన సచివాలయ భవనాలను తెలంగాణకు అప్పగించారు. జూన్‌ 28వ తేదీన ప్రగతిభవన్‌లో ఇద్దరు సీఎంలు, తమ రాష్ట్రాల అధికారుల బృందంతో కలిసి సమావేశమయ్యారు.


ఆగస్టు 1న మరోసారి ఇద్దరు సీఎంలు మాత్రమే భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సముద్రంలో కలుస్తున్న గోదావరి జలాలను ఒడిసి పట్టుకోవాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే గోదావరి జలాలను శ్రీశైలం ప్రాజెక్టుకు తరలించే ప్రతిపాదన ముందుకొచ్చింది. దీనిపై ప్రతిపాదనలు రూపొందించాలని ఇద్దరు సీఎంలు అధికారులను ఆదేశించారు. ఇంజినీరింగ్‌ అధికారులు రూపొందించిన ప్రతిపాదనలపై ఈ భేటీలో ఇద్దరు సీఎంలు చర్చించే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇద్దరు సీఎంలు మధ్యాహ్నం 12 గంటల తర్వాత సమావేశం కానున్నారు.

642
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles