కాంగ్రెస్ పార్టీని వీడిన ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి...

Mon,April 22, 2019 10:21 PM

Congress Party MLA Gandra Venkataramana Reddy join TRS

జయశంకర్ భూపాలపల్లి: తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. జిల్లాకు చెందిన ముఖ్యనాయకుడు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు బహిరంగంగా ప్రకటించారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. అనంతరం టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్‌తో సమావేశమై టీఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. భూపాలపల్లి జిల్లాను అభివృద్ధిలో ముందు వరసలో నిలిపేందుకు సీఎం కేసీఆర్‌తో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారు. తెలంగాణ సమగ్ర అభివృద్ధి టీఆర్‌ఎస్ పార్టీతోనే సాధ్యం.

2135
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles