హుజూర్‌నగర్‌లో ఖాళీ అవుతున్న కాంగ్రెస్..

Wed,October 9, 2019 09:03 PM

హుజూర్‌నగర్: ఈ నెల 21న హుజూర్‌నగర్ అసెంబ్లీకి ఉప ఎన్నిక జరగనుందని తెలిసిన విషయమే. ప్రధాన పార్టీ అయిన టీఆర్‌ఎస్, కాంగ్రెస్ తదితర పార్టీలు ప్రచారంలో బిజీబిజీగా ఉన్నాయి. కాగా, హుజూర్‌నగర్‌లో ఎంత మంది అభ్యర్థులు పోటీలో ఉన్నప్పటికీ పోటీ అధికార టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల మధ్యేనని విశ్లేశకులు అంచనా వేస్తున్నారు. కాగా, నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన మున్సిపాలిటీలోని పలు వార్డులకు చెందిన కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో మంత్రి జగదీష్ రెడ్డి, ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీందర్ వారిని గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.


ఈ సందర్భంగా పార్టీలో చేరిన కార్యకర్తలు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి పథకాలకు ఆకర్షితులమయ్యే టీఆర్‌ఎస్‌లో చేరుతున్నామన్నారు. పార్టీ అభ్యర్థి సైదిరెడ్డి గెలుపుకు అహర్నిషలు కష్ట పడతామన్నారు. మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. హుజూర్‌నగర్‌లో టీఆర్‌ఎస్ ఏకపక్ష విజయం సాధించనుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 24న ఈసీ ఎన్నికల ఫలితాలు ప్రకటించనుంది.

1718
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles