18 సంవత్సరాలుగా పరారీలో ఉన్న నేరస్తుడి అరెస్ట్

Thu,September 19, 2019 04:24 PM

హైదరాబాద్: భార్యను చంపిన కేసులో శిక్షపడి హైకోర్టులో పిటిషన్ వేసి బెయిల్‌పై బయటకు వచ్చిన నేరస్తుడు పరారయ్యాడు. దోషి పరారైన 18 సంవత్సరాలకు ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులకు చిక్కాడు. సంఘటన వివరాల్లోకి వెళితే జనగాం పట్టణానికి చెందిన ఎండీ ఖాజా ఫయాజుద్దీన్, ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపు నెంబర్ 4లో నివాసం ఉంటున్న ఫాతిమా పర్వీన్‌ను జనవరి 25వ తేదీ 1993లో వివాహం చేసుకున్నాడు. ఫయాజుద్దీన్ వేధింపులకు పర్వీన్ జనవరి 25వ తేదీ1994న కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఫయాజుద్దీన్‌ను నాంపల్లి మహిళా కోర్టులో హాజరుపర్చారు.


విచారణ అనంతరం కోర్టు అతడికి మూడు సంవత్సరాలు శిక్ష విధించి ఫియాజుద్దీన్ కుటుంబ సభ్యులపై కేసు కొట్టేసింది. ఫయాజుద్దీన్ తనకు పడిన శిక్షపై హైకోర్టులో అప్పీల్ చేసుకున్నాడు. 2001లో హైకోర్టు ఫయాజుద్దీన్ శిక్షను మూడు సంవత్సరాల నుంచి ఒక సంవత్సరానికి తగ్గించింది. అప్పటి నుంచి దోషి అయిన ఫియాజుద్దీన్ పరారీలో ఉండగా కోర్టు అతడిపై అరెస్టు వారెంట్ జారీ చేసింది. 18 సంవత్సరాల అనంతరం ఈ రోజు ఫయాజుద్దీన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపర్చగా, కోర్టు ఆదేశాల మేరకు చంచల్‌గూడ జైలుకు తరలించారు.

1642
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles