గుండె సమస్యలను గుర్తించేందుకు కోఆర్డినేషన్‌ కమిటీ

Fri,August 2, 2019 07:45 AM

coordination committee to find heart problems


బంజారాహిల్స్ : గుండె సంబంధిత వ్యాధులు వచ్చేందుకు గల రిస్క్‌ఫ్యాక్టర్స్‌ ఉన్నవారిని గుర్తించేందుకు ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్‌, అపోలో హాస్పిటల్స్‌ నేషనల్‌ క్లినికల్‌ కోఆర్డినేషన్‌ కమిటీని ఏర్పాటు చేయనున్నాయి. కార్డియాలజీ, కార్డియో వాస్కులర్‌ సమస్యల చికిత్సలో ఉపయోగించే ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ను మైక్రోసాఫ్ట్‌ సంస్థ సమకూర్చనున్నది. దీంతో పాటు క్లినికల్‌ ఆల్గరిథమ్‌, ట్రీట్‌మెంట్‌ గైడ్‌లైన్స్‌ను రూపొందించడంలో రెండు సంస్థలు పరస్పర సహకారం అందిస్తుందని మైక్రోసాఫ్ట్‌ కార్పొరేట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అనిల్‌ బన్సాలీ ఒక ప్రకటనలో తెలిపారు. యూరోప్‌ తదితర దేశాలతో పోలిస్తే పదేండ్లు ముందుగానే జనం వీటి భారిన పడటానికి గల కారణాలపై కొత్తగా ఏర్పాటు చేసుకుంటున్న నేషనల్‌ క్లినికల్‌ కోఆర్డినేషన్‌ కమిటీ పని చేస్తుందని అపోలో జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సంగీతారెడ్డి పేర్కొన్నారు.

580
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles