వింత ఆకారంలో లేగదూడ జననం

Sun,August 25, 2019 08:07 PM

Cow gives birth to calves with two heads

రాయపర్తి: వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండలంలోని కొలన్‌పల్లి గ్రామంలో ఓ ఆవుకు వింత దూడ జన్మించింది. గ్రామంలోని రైతు వంగాల మల్లయ్యకు చెందిన ఆవు ఆదివారం వింత ఆకారంలో ఉన్న లేగదూడకు జన్మనిచ్చింది. లేగదూడకు రెండు తలలు, రెండు నాలుకలు (పూర్తి స్థాయిలో ఆకారాలు డెవలప్ కాలేదు) జన్మించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఐతే లేగదూడ వింత ఆకారంలో ఉండటంతో గ్రామస్తులు ఆసక్తిగా తిలకించారు. కాగా ఈ విషయమై స్థానిక పశు వైద్యాధికారులను వివరణ కోరగా జన్యులోపం వలన ఇలాంటి వింత ఆకారాలతో దూడలు జన్మిస్తాయన్నారు.

2887
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles