పాక్‌ వస్తువులపై 200 శాతం సుంకం పెంపు

Sat,February 16, 2019 09:24 PM

Customs Duty On Goods From Pak Raised To 200% After Pulwama Terror Attack

న్యూఢిల్లీ: పుల్వామా దాడి ఘటన నేపథ్యంలో పాకిస్థాన్‌పై అన్ని రకాలుగా ఒత్తిడి పెంచాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. అత్యంత ప్రాధాన్య దేశం(మోస్ట్‌ ఫేవర్డ్‌ నేషన్‌) హోదాను వెనక్కి తీసుకున్న 24 గంటల్లో కేంద్ర ప్రభుత్వం పాక్‌పై మరో చర్యకు ఉపక్రమించింది. పాకిస్థాన్‌ నుంచి దిగుమతి అయ్యే అన్ని రకాల వస్తువులపై దిగుమతి సుంకం 200 శాతం పెంచుతూ నిర్ణయం వెలువరించింది. భారత్‌ నుంచి పాక్‌కు పత్తి, రంగులు, రసాయనాలు, కూరగాయలు, ఇనుము, స్టీల్‌ ఎగుమతి అవుతుండగా, పాక్‌ నుంచి భారత్‌కు పండ్లు, సిమెంట్‌, తోలు, రసాయనాలు, సుగంధ ద్రవ్యాలు దిగుమతి అవుతున్నాయి.

3095
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles