మూసీ నదిలో వ్యక్తి మృతదేహం లభ్యం

Mon,August 19, 2019 10:54 AM

dead body found at Musi River in Amberpet

హైదరాబాద్ : అంబర్‌పేట పోలీసు స్టేషన్ పరిధిలోని అలీ కేఫ్ సమీపంలోని మూసీ నదిలో ఓ వ్యక్తి మృతదేహం కొట్టుకుపోతుండడాన్ని స్థానికులు గమనించారు. దీంతో పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. డీఆర్‌ఎఫ్ బృందాలను పోలీసులు అప్రమత్తం చేయగా.. ఆ బృందాలు అక్కడికి హుటాహుటిన చేరుకున్నాయి. మొత్తానికి కొట్టుకుపోతున్న వ్యక్తి మృతదేహాన్ని డీఆర్‌ఎఫ్ బృందాలు, పోలీసులు కలిసి మూసీలో నుంచి బయటకు తీశారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతుడి శరీరం కాలిపోయి ఉంది. హత్యా? లేక ఆత్మహత్య? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.


1022
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles