భార్య మృతిని తట్టుకొలేని భర్త మృతి

Sat,October 12, 2019 10:15 PM

కులకచర్ల: భార్య భర్తలో సగం సగం అంటారు. వివాహమైననాటి నుండి భార్యాభర్తలు ఇద్దరు అన్యోన్యంగా ఉంటూ కష్టసుఖాల్లో పాటు పంచుకుంటూ తమ పిల్లలో అనురాగంగా ఉంటూ ఉండే భార్య భర్తల బంధం విడదీయరానిదిగా నిలుస్తుంది. భార్య మృతితో భర్త మృతి చెందిన సంఘటన కులకచర్ల మండల పరిధిలోని చెల్లాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. కులకచర్ల మండలం చెల్లాపూర్ గ్రామానికి చెందిన మల్‌రెడ్డిపల్లి చెంద్రమ్మ (70) ఉదయం అనారోగ్యంతో మృతి చెందింది. దీంతో భార్య మృతిని తట్టుకోలేని భర్త అంజిలయ్య (75) ఒక్కసారిగా కుప్ప కూలాడు.


తన భార్య లేని జీవితం ఎలా గడుపాలి...తన భార్యలేని జీవితం ఇంక ఎందుకు అనుకున్నాడో...తన బార్యతోనే తన తనువు కూడా పోవలని భావించాడో కాని భార్య మృతిచెందిన 3 గంటల్లోనే మృతి చెందాడు. దీంతో చెల్లాపూర్ గ్రామంలో విషాదచ్ఛాయలు అలముకున్నాయి. ఒకే ఇంట్లో ఇద్దరి చావు...అది భార్యభర్తలు మృతి చెందడం పలువురిని తీవ్రదిగ్భ్రాంతికి గురిచేసింది. మృతులు చెంద్రమ్మ, అనంతయ్యలకు 5 మంది పిల్లలు ఉన్నారు. భార్య మృతిని తట్టుకోలేక తనువు చాలించిన అంజిలయ్యను చూసి కంట తడి పెట్టనివారు ఎవ్వరు లేరు. భార్యభర్తలు ఇరువురు మృతి చెందడంతో శనివారం గ్రామంలో అంత్యక్రియలు జరిగాయి. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అంత్యక్రయలలో పాల్గొన్నారు.

698
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles