మన్యంకొండ సమీపంలో పట్టాలు తప్పిన రైలు..

Wed,October 9, 2019 08:09 PM

మహబూబ్ నగర్: మన్యంకొండ సమీపంలో ఓ రైలు పట్టాలు తప్పింది. సింగిల్ రైల్వే లైన్ కావడంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. వివరాల్లోకెళ్తే.. మన్యంకొండ సమీపంలో తుంగభద్ర ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. కాచిగూడ నుంచి గుంటూరు వెళ్లే ప్యాసెంజర్ రైలు మహబూబ్ నగర్ స్టేషన్లో నిలిపివేశారు. సుమారు రెండున్నర గంటలు ప్రయాణికులు రైళ్లో ఇబ్బందులు పడ్డారు. దీంతో, పలు ఎక్స్ ప్రెస్, ప్యాసెంజర్ రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. దసరా సందర్భంగా గమ్యస్థానాలకు వెళ్లేందుకు బయలు దేరిన ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి.


మన్యంకొండ నుంచి హైదరాబాద్ వైపునకు ప్రయాణికులను తరలించేందుకు రవాణ శాఖ అధికారులు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నారు. మహబూబ్ నగర్ నుంచి మన్యంకొండకు అధికారులు 5 ఆర్టీసీ బస్సులను ఏర్పాటుచేశారు. పట్టాలు తప్పిన రైలును రైల్వే పట్టాలు సరిచేసే మిషన్ తో తొలగించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. రైలును పట్టాల పైకి ఎక్కించేందుకు ఇంకా సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. దీని ప్రభావం వల్ల కర్నూలు సిటీ- కాచిగూడ- తుంగభద్ర ఎక్స్ ప్రెస్, కాచిగూడ- గుంటూరు ప్యాసెంజర్, రాయిచూరు- కాచిగూడ, కాచిగూడ- కర్నూలు సిటీ, కాచిగూడ- మైసూరు, ఓఖా- రామేశ్వరం, యశ్వంత్ పూర్- ఇండోర్ తదితర రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది..

1948
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles