భక్తులతో కిటకిటలాడుతున్న శైవాలయాలు

Mon,November 4, 2019 11:24 AM

హైదరాబాద్ : రాష్ట్రంలోని శైవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా శివాలయాలకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. కీసర, భద్రాచలం, వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయం, కాళేశ్వరం దేవాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే మహిళలు ఆలయాల వద్ద కార్తీక దీపాలు వెలిగిస్తున్నారు. గోదావరిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి దీపాలను వెలిగించి వదిలారు. ఆలయాల్లోని శివలింగాలకు పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు భక్తులు. ఆలయాలన్నీ శివనామస్మరణలతో మార్మోగిపోతున్నాయి.

383
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles