దీపావళి.. అగ్నిప్రమాదం జరిగితే 101కు కాల్ చేయండి

Mon,November 5, 2018 02:09 PM

హైదరాబాద్ : దీపావళి పర్వదినం సందర్భంగా బాణాసంచా కాల్చినప్పుడు అనుకోకుండా అగ్నిప్రమాదం జరిగితే 101, 9949991101 నంబర్లకు ఫోన్ చేయాలని అగ్నిమాపక శాఖ అదనపు డీజీ గోపికృష్ణ సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా 4,258 బాణాసంచా దుకాణాలకు లైసెన్సులు ఇచ్చినట్లు వెల్లడించారు. రంగారెడ్డిలో అత్యధికంగా 1436 దుకాణాలకు, 946 దుకాణాలకు అనుమతులతో రెండో స్థానంలో హైదరాబాద్ ఉందని ఆయన తెలిపారు. వరంగల్ 371, ఆదిలాబాద్ 305, మహబూబ్‌నగర్‌లో 90 దుకాణాలకు అనుమతులు ఇచ్చామన్నారు. బాణాసంచా కాల్చే ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్న అదనపు డీజీ.. ఖాళీ స్థలాల్లోనే బాణాసంచా కాల్చాలని ఆదేశించారు. కాటన్ దుస్తులు ధరించాలి. బకెట్లలో నీళ్లు, బ్లాంకెట్లను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. రాకెట్లు కాల్చే ముందు సరైన దిశలో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు గోపికృష్ణ.

2075
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles