వరంగల్ చేరుకున్న వివిధ జిల్లాల కలెక్టర్లు.. రేపు కాళేశ్వరం సందర్శన

Tue,August 27, 2019 03:41 PM

వరంగల్ అర్బన్: రాష్ట్రంలోని వివిధ జిల్లాల కలెక్టర్లు రేపు కాశేశ్వరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు పలు జిల్లాల కలెక్టర్లు నేడు వరంగల్‌కు విచ్చేశారు. కాసేపట్లో రెవెన్యుశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆధ్వర్యంలో హోటల్ హరితలో జరిగే సమావేశానికి హాజరుకానున్నారు. కలెక్టర్లు రాత్రికి వరంగల్‌లోనే బస చేయనున్నారు. రేపు ఉదయం ప్రాజెక్ట్ సందర్శనకు వెళ్లనున్నారు. పర్యటనలో భాగంగా ముందుగా కాళేశ్వరం ముక్తీశ్వరస్వామిని దర్శించుకుకోనున్నారు. అనంతరం కన్నెప్లలి పంప్‌హౌజ్, మేడిగడ్డ, అన్నారం బ్యారేజ్‌లను సందర్శించనున్నారు. రేపు సాయంత్రం కాళేశ్వరం పర్యటనను ముగించుకోనున్నారు. సీఎం కేసీఆర్ సూచన మేరకు కలెక్టర్లు కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలిస్తున్నారు.

1918
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles