లక్ష్మీ బ్యారేజ్‌ను సందర్శించిన కలెక్టర్ల బృందం

Wed,August 28, 2019 02:54 PM

జయశంకర్‌ భూపాలపల్లి: రెవెన్యూ స్పెషల్‌ సెక్రటరీ సోమేష్‌ కుమార్‌ నేతృత్వంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శిస్తున్నారు. ముక్తేశ్వరస్వామి దర్శనం, పూజల అనంతరం కలెక్టర్లు ప్రాజెక్టు సందర్శనకు బయల్దేరి వెళ్లారు. ప్రాజెక్టు పర్యటనలో భాగంగా కలెక్టర్ల బృందం మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్‌ను సందర్శించింది. నీటి లభ్యత, బ్యారేజ్‌ సామర్థ్యం, నీటి నిల్వ, వరద సమయంలో నీటి ప్రవాహం, గేట్ల నిర్మాణం తదితర అంశాలపై ఈఎన్‌సీ వెంకటేశ్వర్లు కలెక్టర్లకు వివరించారు.

984
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles