రేపట్నుంచి ఒక్క రూపాయి కూడా లంచం ఇవ్వకండి : సీఎం కేసీఆర్

Fri,March 29, 2019 06:34 PM

Do not give bribe to govt Officers says CM KCR

నల్లగొండ : ప్రభుత్వ అధికారులకు రేపట్నుంచి ఒక్క రూపాయి కూడా లంచం ఇవ్వకండి అని రైతులకు సీఎం కేసీఆర్ సూచించారు. మిర్యాలగూడలో ఏర్పాటు చేసిన నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. నేను యువ రైతుతో ఫోన్‌లో మాట్లాడిన తర్వాత నా పీఏలకు, కార్యాలయానికి వందల వేల సంఖ్యలో ఫోన్లు వస్తున్నాయి. నేను హామీ ఇస్తున్నా. నెల పదిహేను రోజులు ఓపిక పట్టండి. గ్రౌండ్‌లో ఏం జరుగుతున్నాయో నాకు తెలుసు. నేను రైతుబిడ్డనే. ఆ బాధలు నాకు తెలుసు. కాబట్టి నెల పదిహేను రోజుల దాకా ఎవరికి లంచం ఇవ్వకండి. మ్యుటేషన్లు, పట్టాలు చేసుకోకండి. జూన్ మాసంలో దేశమే ఆశ్చర్య పడే విధంగా రైతుల యొక్క సకల బాధలు తీరుస్తాను. అప్పటి దాకా రూపాయి నోటు కూడా ఏ దుర్మార్గుడికి కూడా లంచం ఇవ్వకండి. రేపట్నుంచి లంచం ఇవ్వడం బంద్ చేయండి. రైతులు నా మాటలు వినాలి. నెల పదిహేను రోజుల వరకు మీ పనులు పెండింగ్ పెట్టుకోండి. ఆ తర్వాత విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకొని రైతుల సమస్యలు పరిష్కారం చేస్తాను. రైతుల సమస్యలు, పోడు భూముల సమస్యలను పరిష్కరించే దాకా నేను నిద్రపోను.. అధికారులను నిద్ర పోనివ్వను అని సీఎం కేసీఆర్ ఉద్ఘాటించారు.

5151
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles