ట్రాక్టర్ బోల్తాకొట్టి డ్రైవర్ మృతి

Thu,April 18, 2019 10:12 PM

driver killed in tractor rollover accident

మల్లాపూర్ : జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని పాతదాంరాజ్‌పల్లి గ్రామ శివారులోని గోదావరి నది నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఓ ఇసుక ట్రాక్టర్ బొల్తా కొట్టి డ్రైవర్ మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మహారాష్ట్రలోని ఉమేర్ఖేడ్‌కు చెందిన లడికెవర్ వికాస్ (23) జీవనోపాది నిమిత్తం మెట్‌పల్లికి చెందిన ఇసుక వ్యాపారి నర్సయ్య వద్ద ఏపీ 15 టీసీ 6188 ట్రాక్టర్‌ను నడుపుతు జీవనం కోనసాగిస్తున్నాడు.

విధుల్లో భాగంగా మెట్‌పల్లి నుండి పాతదాంరాజ్‌పల్లి గోదావరి నదికి ఇసుకను తీసుకువెళ్లడానికి కూలీలతో వచ్చి ఇసుకను ట్రాక్టర్‌లో నింపి ఒడ్డుకు తీసుకువచ్చే క్రమంలో ఒక్కసారిగా ప్రమాదవశత్తు ట్రాక్టర్ ఇంజన్ బొల్తా కొట్టడంతో ఇంజన్, ట్రాలీ మధ్య డ్రైవర్ వికాస్ ఇరుక్కుపోగా తలకు బలంగా గాయాలు కావడంతో అక్కడిక్కడే మృతి చెందినట్లు తెలిపారు. సంఘటన స్థలంను స్థానిక ఎస్‌ఐ పృథ్వీదర్ పరిశీలించడంతో పాటు, మృతుని బాబాయ్ లడికెవర్ బలరాం పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకోని ధర్యాప్తు చేస్తున్నట్లు పేర్కోన్నారు.

2591
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles