తాగి వాహనం నడిపితే డ్రైవింగ్‌లైసెన్స్ రద్దు

Thu,February 11, 2016 11:18 AM

హైదరాబాద్ : మందుబాబులు.. జర జాగ్రత్త... పీకలదాగా మద్యం సేవించి రోడ్లపై వాహనం నడిపిస్తానంటే ఇక కుదరనే కుదరదు.. చలాన్లు, కోర్టు కేసులతో ఇంతకాలం నెట్టుకొచ్చిన మందుబాబుల్లో మార్పు రావడం లేదని గుర్తించిన పోలీసులు వీరిపై మరింత ఉక్కుపాదం మోపాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే వరుసగా మూడు సార్లు డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన వారి జాబితాను పోలీసులు సిద్ధం చేసి ఈ వాహనదారుల డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయాలని ఇటీవల ఆర్టీఏకు సిఫార్సు చేశారు.


పోలీస్ శాఖ సిఫార్సు మేరకు 81 మంది వాహనదారుల డ్రైవింగ్ లైసెన్స్‌లు రద్దు చేసినట్లు జేటీసీ రఘునాథ్ వెల్లడించారు. ఖైరతాబాద్‌లో 31 మంది, సికింద్రాబాద్‌లో 14 మంది, మెహిదీపట్నంలో 9 మంది, బండ్లగూడలో 11 మంది , మలక్‌పేట ఆర్టీఏ పరిధిలో 16 మంది వాహనదారుల లైసెన్స్‌లు రద్దు చేసినట్లు వివరించారు. డ్రైవింగ్ లైసెన్స్‌లు రద్దయిన వీరంతా తిరిగి మూడు నెలల వరకు మళ్లీ డ్రైవింగ్ లైసెన్స్ పొందేందుకు అనర్హులుగా పరిగణించనున్నారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు డ్రంక్ అండ్ డ్రైవ్‌పై మరింత కఠినంగా వ్యవహరిస్తామని అధికారులు చెప్పారు.

1306
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles