డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చేయించుకోకుంటే...

Sat,June 23, 2018 06:47 AM

హైదరాబాద్ : సాధారణంగా డ్రైవింగ్ లైసెన్స్ వ్యాలిడిటీ తుది గడువులోగా పునరుద్ధరణ కోసం నిర్ణీత ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకుంటే పొందే అవకాశం ఉటుంది. గడువు ముగిసిన తర్వాత దరఖాస్తు చేస్తే అపరాధ రుసుము వసూలు చేసి లైసెన్స్ జారీచేస్తున్నారు. అయితే లైసెన్స్ వ్యాలిడిటీ ముగిసి నాలున్నరేండ్లు దాటిన తర్వాత దరఖాస్తు చేసుకున్నవారికి మాత్రం అపరాధ రుసుముతో సరిపెట్టకుండా.. మళ్లీ ఎల్‌ఎల్‌ఆర్ టెస్ట్ రాయడంతోపాటు మరోసారి డ్రైవింగ్ టెస్ట్‌కు హాజరుకావాల్సి ఉంటుంది. ఆ టెస్ట్‌లో పాసైతేనే లైసెన్స్ జారీ చేస్తారు. ఈ సమయంలో కొత్తగా లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా ఉండదు. కచ్చితంగా అపరాధ రుసుము చెల్లించి, పరీక్షలు పాస్ కావాల్సిందే. ఈ అంశం రవాణాశాఖ నిబంధనల్లో ఉన్నది. ఈ విషయం తెలియక చాలా మంది లైసెన్సుదారులు అధికారులతో వాగ్వాదానికి దిగుతున్నారు.

7786
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles