'డ్రగ్స్‌ కేసు దర్యాప్తు కొనసాగుతుంది'

Wed,May 15, 2019 05:33 PM

Drugs case investigation continues says excise officials

హైదరాబాద్‌: మాదకద్రవ్యాల కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతుందని ఎక్సైజ్‌శాఖ అధికారులు తెలిపారు. టాలీవుడ్‌ సినీ నటులు సహా ఏ ఒక్కరికీ క్లీన్‌ చిట్‌ ఇవ్వలేదని తెలిపారు. మొత్తం 12 కేసుల్లో ఇప్పటి వరకు ఏడు ఛార్జిషీట్లు దాఖలు అయ్యాయని వెల్లడించారు. ఇంకా ఐదు ఛార్జిషీట్లు దాఖలు చేయాల్సి ఉందన్నారు. సమాచారం హక్కు చట్టం కింద ఫోరం ఫర్‌ గుడ్‌గవర్నెన్స్‌ కార్యదర్శి పద్మనాభరెడ్డి టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు విచారణ వివరాలు కోరారు. దీనిపై స్పందించిన ఎక్సైజ్‌శాఖ సంబంధిత సమాచారాన్ని తెలియజేసింది. కేసు దర్యాప్తు సందర్భంగా 12 మంది టాలీవుడ్‌ నటీ, నటులు, దర్శకులు, టెక్నిషియన్స్‌తో పాటు మరో 62 మందిని విచారించినట్లు వెల్లడించినట్లు పేర్కొంది. సినీ ప్రముఖుల వ్యవహారంలో ఫోరెన్సిక్‌ ఆధారాలు వచ్చినట్లు తాజాగా తెలిపింది. ఈ కేసులో త్వరలోనే మిగతా ఛార్జిషీట్లు దాఖలు చేస్తామని అధికారులు తెలిపారు. మాదకద్రవ్యాల కేసుతో సంబంధం ఉన్న ఎవరినీ వదిలిపెట్టేదిలేదని పేర్కొన్నారు.

559
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles