డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠా నాయకుడు అరెస్ట్

Mon,July 1, 2019 05:40 PM

హైదరాబాద్: మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్న ముఠానాయకుడిని ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. నైజీరియన్ల ముఠా నాయకుడు డివైన్ ఎబుకసుజుతో పాటు మరో యువతిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి అరెస్టుకు సంబంధించిన వివరాలను అబ్కారీశాఖ డిప్యూటీ కమిషనర్ వివేకానందరెడ్డి వెల్లడించారు. నిందితుల నుంచి 106 గ్రాములు కొకైన్, రూ.70వేల నగదు, నాలుగు సెల్‌ఫోన్లు, బైక్ స్వాధీనం చేసుకున్నారు. బ్రెజిల్ నుంచి సముద్రమార్గంలో మాదకద్రవ్యాలను తెస్తున్నట్లు గుర్తించారు. బెంగళూరు, హైదరాబాద్, కేంద్రాలుగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని తెలిపారు.

891
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles